ఒకసారి ఒక స్నేహితుని (అందులోనో అప్పట్లో ప్రాణస్నేహితుడు ..ఇప్పుడు ఎక్కడ పోయాడో కూడా తెలియదు..life changes కదా ) ఇంటికి వెళ్ళాను.
వాళ్ళ ఇల్లు అంటే మా ఇంటి లెక్కనే. అంత చనువు. వాళ్ళ పేరెంట్స్ , అక్క అందరికీ నేనంటే చాలా ఇష్టం అభిమానం. నా ఫేసులో ఏం నచ్చిందోకానీ!
మా ఫ్రెండు తల్లిచాటు బిడ్డ. "అమ్మో అమ్మ తిడుతుంది " అనే రకం. ఈ మాట అనేటప్పటికి వాడు లోకం లెక్కప్రకారం పెళ్ళీడు వచ్చేసినవాడే.
అలా వాడికి భయం , భక్తీ అయిన వాళ్ళ అమ్మ అంటే నాకూ ఎంతో గౌరవం. పేరుకు ఇంగ్లీషు పదం "ఆంటీ"తో పిల్చినా , ఒక motherly feeling ఎప్పుడూ ఉండేది.
ఇప్పుడు మొదటి లైనులోకెళ్ళ్తే , ఒకరోజు వాళ్ళింటికి వచ్చినప్పుడు కొత్తగా టేబుల్ పై ఉన్న ఒక పాత ఫోటో చూసాను.
అది "ఆంటీ" కాలేజ్ డేస్‍లో తీసుకున్నది. తన స్నేహితురాళ్ళతో కలిసి. ఇదిగో మా మమ్మీ ఇలా ఉండేది అని మా ఫ్రెండు వాళ్ళ అక్క చూపిస్తుంటే , వెనుక ఏమో ఆంటీ కాఫీ తెస్తూ.
ఆ క్షణం ....
నా ఎదురుగా ఒక మనిషి మూడు ముక్కలైనట్లు.
ఫోటోలో ఒక బ్యూటిఫుల్ యంగ్ లేడీ . కానీ ఆ మనిషి ఇప్పుడు ఇక్కడ లేదు. లేదా అంటే , ఉంది. శారీరికంగా ఆ ఫోటోలోని అమ్మాయి వెనుక కాఫీ తెస్తున్న ఆంటీనే. కానీ ఖచ్చితంగా మానసికంగా ఆమె ఈమె కాదు అనిపించింది.
నా పక్కన ఉన్న ఆమె కూతురు ... దాదాపు ఆ ఫోటోలోని మనిషి పోలికలే. ఛాలా భయం వేసింది.
ఈ అమ్మాయి..అదే అక్క.... ఇలానే మానసికంగా నశించబోతోందా అని.
చచ్చిపోవడం బ్రతకడం వేరు , మారిపోవడం నశించడం వేరు.
మనుష్యులు మారుతారు. కాలాన్ని బట్టి , కష్టాలను బట్టి. కానీ ఆ మార్పులో ఎంత నాశనం ?
ఫోటోలోని అమ్మాయి.... she was a Queen and still looks like one.
ఆమె సౌందర్యం , ఆ ఆకృతిలో కంటే ఆమెలో తొణికసలాడే ఆత్మవిశ్వాసంలో ఉంది. ఆ రోజుల్లో కాలేజ్ , చేతిలో బుక్స్, ప్రపంచంలో ఏదో సాధిస్తాను అనే పొగరు , కాంక్ష.
ఈ ఆంటీలో " ఇలా బా..నే..ఉన్నాను" అనే నిర్లిప్తత. తను ఇప్పుడు కూడా నవ్వుతుంది .. కానీ ఆ నవ్వులు వేరే.
పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతాం . anna karenina లాంటివి. అలాంటి అసంతృప్తులు ఎక్కడో ఉంటారు అనుకుంటాం. కానీ మన ఇంట్లో అమ్మో అక్కో అంతే క్షోభ అనిభవిస్తుండవేమో అని ఆలోచనైనా చేయమే !!
అమ్మగా ఉండేందుకు , అక్కగా ఉండేందుకా అమ్మాయిలు ?!! అంతేనా ?!
ఈవాల్టి రోజుల్లో కూడా వాళ్ళ నెత్తిన మన కోసం "పవిత్రత" అద్దేసి ఇలా ఉండాలి అనుకోవడానికి నాకేం హక్కుంది ? నాకే చేతైతే అమాంతంగా ఆంటీను పటేసుకుని ఆ ఫోటోలోకి తోసేసి " ఫో...ఇంకో చాన్స్ ఇస్తున్నా.... నీ లైఫ్ ఇంకెలా ఉంటుందో చూపించు " అందాం అనుకున్నా . కానీ నాకు కాఫీ ఇచ్చాక అంకుల్ కోసం ఏదో వంట చేయడానికి కిచెన్‍లోకి వెళ్ళిపోయింది.
A place to know about women/girls from a male point of view and as well guess what could be the female point of view.
Sunday, August 22, 2010
Friday, August 20, 2010
ఆ అమ్మాయికి అంకితం
మొత్తానికి బ్లాగు క్రియేట్ చేసేసాను , ఇక తొలి పోస్ట్ దేని గురించి రాద్దాం అనే సందేహం ఒకటే పీడిస్తుండగా , చెప్పవలసిన ఎన్నో సంగతుల్లో మొట్టమొదటగా అసలు ఈ బ్లాగు పేరు ఎలా పుట్టిందో చెబితే బావుంటుంది అనిపించింది. ఇదీ కథ :
కొన్ని గంటలక్రితం ఈ బ్లాగు మొదలుపెడుతున్నప్పుడు చాలా టైటిల్స్ ఆలోచించుకున్నాను . నా బ్లాగు " స్త్రీలింగధారులు" గురించి కాబట్టి....
వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నా genderను తెలుగులో అలానే అంటాం కదా ... టైటిలు అదే పెడదామా అనుకున్నా. మరీ పెద్దదయితే "స్త్రీలింగులు" అని. ఇంగ్లీషులో టైప్ చేస్తే "streelingulu" అని వస్తుంది. చివర్లో నాకు "లు" నచ్చలేదు. పైగా ఇదేదో డా సమరం తరహా సైటులా అనిపిస్తుందనిపించి ఆ శతకోటి లింగాల్లో నేనో బోడి లింగాన్ని అవడం ఇష్టం లేక ఆ ఐడియాను abort చేసేసాను . ( ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకూ అబార్షన్లు ఉంటాయి ...చాలా విషయాల్లో... ఈ నా ఆలోచనను నొక్కివక్కాణించుటకు నేను ఈ ABORT అను పదాన్ని పదేపదే వాడేదనని ఇప్పుడే మనవి చేసుకుంటున్నాను )
ఇక... స్త్రీలు తమను తాము కాస్తంత కవితాత్మకంగానో , గొప్ప పదాలతోనో, వినసొంపైన మాటలతోనో పిలిస్తే ఇష్టపడతారని తరతరాలనుంచి ఉన్న cliche. ఆ క్లీషే ఇంతవరకూ నా జీవితంలో తప్పు కాలేదు కూడా. ఈసారి కూడా పాటిస్తే పోలా అనుకుని "మహిళలు" "అతివలు " " వనితలు" " ఆడవాళ్ళు" "మోహనాంగులు" " సుందరాంగులు" " ఇంతులు" "భామలు" " బామ్మలు" (భామ వచ్చాక బామ్మ రాకపోతే నాలోని దిక్కుమాలిన ప్రాస-పీడిత హృదయం ఒప్పుకోదు), "జవ్వనులు" " ముదివలు" ( ప్రాస బావున్నా విధవలు అనే పదం చెప్పట్లేదు...పాపం కదా )..ఇలా ఎన్నో టైటిల్స్ స్ఫురణకు వచ్చాయి. కానీ ఇవేవీ మనం సాధారణంగా ఉపయోగించే పదాలు కావే అనిపించింది. సింప్లిసిటీ లేని రచన రచనే కాదని నమ్మే నేను... మనం రోజూ పిలుచుకునే పదాలతోనే కొనసాగితే పోలా అనుకున్నాను.
నాకు తెలిసి , commonగా ..ఆడోళ్ళు అంటారు , అమ్మాయిలు అంటారు , లేడీసు అంటారు.
ఆడోళ్ళు మరీ మోటుగా అనిపించింది. ఆడవాళ్ళు అనేదాన్ని ఇంగ్లీషులో టైప్ చేస్తే , "ళ్ళు" కు మామూలు "ll" టైప్ చెయ్యాల్సి రావడం నచ్చలేదు.
లేడీస్.. ఇంగ్లీష్ ఎందుకులే అనిపించింది. లేడీసు అనే తెంగ్లీకరణ నచ్చింది.
కానీ అమ్మాయిలు అనే పదానికి మనసు ఎక్కువ ఓటు వేసింది. అమ్మాయిలు అనే పదంలో ఒక "యవ్వనం" ఉంది. గ్లామర్ ఉంది. పైగా ఈ బ్లాగు ప్రపంచంలో అధికశాతం ఆ యవ్వనపు యేజ్ గ్రూప్ వారే అనిపిస్తుంది. కాబట్టి సులభంగా identify అవుతారు కదా అనిపించింది. పైగా నేటి అమ్మాయిలే రేపటి మహిళలు. ఒక్కోసారి నేటీ అమ్మాయిలే నేటి మహిళలు కూడా. కాబట్టి అమ్మాయిలు కు వోట్ చేసా. అప్పుడు ఇంగ్లీషులో...
"ammaayilu" అని టైప్ చెయ్యాల్సింది. మళ్ళీ నాకు ఆ "lu" నచ్చలేదు.అప్పుడు నా ఆలోచనల్లో ఒక ఙ్ఞాపకం మెరిసింది.
అది ఏడవ క్లాసు. మా క్లాసుల్లో అబ్బాయిలందరూ ఉవ్విళ్ళూరిన క్లాసు. ఎందుకంటే 7th class నుంచి మా స్కూల్లో యూనిఫారం మారుతుంది. అబ్బాయిలకు నిక్కర్లు పోయి ప్యాంట్లు వస్తాయి ( అంటే ప్యాంట్ల అడుగున ఉండొచ్చు కూడా ) అమ్మాయిలకు స్కర్ట్స్ బదులు చుడీదార్ లాంటి డ్రస్సు వస్తుంది. పైటలా చున్నీ కూడా. అవన్నీ ఎందుకో ..లింగభేదం సృష్టించే కోరికలు/డ్యామేజీలు తెలియని ఆ చిన్న బుర్రలకు జస్ట్ ఒక change అంతే.
ఆ క్లాసుల్లో... ఒకరోజు....
ఒక రోజు రావాల్సిన సైన్సు మేడమ్ రాలేదు. అల్లరి చేస్తున్న మమ్మల్ని కంట్రోల్ చెయ్యడానికి చండశాసనముండావాడిగా ఖ్యాతిగాంచిన లెక్కల మాస్టరు వచ్చాడు. కొట్టడం అతనికో సరదా. "అమ్మాయిలను కూడా కొడతాడ్రా! "అని అతని objectivenessగురించి మేము గొప్పగానూ, చెడ్డగానూ చెప్పుకునేవాళ్ళం. ఆ వేళ ఏం పోయే కాలం వచ్చిందో అతనొచ్చి మమ్మల్ని general knowledge ప్రశ్నలు వేస్తూ కూర్చున్నాడు. అదేంటో మరి మేం తప్పు సమాధానాలు చెప్పినా కొట్టడం లేదు . కానీ ఆ "సైకో" ఎప్పుడు ఎలా behave చేస్తాడో అని మా అందరికీ భయంగానే ఉంది. హఠాత్తుగా ఒక ప్రశ్న సంధించాడు.
" వెక్కిళ్ళను ఇంగ్లీషులో ఏమంటారు ? "
క్లాసులో సుమారు పాటి ర్యాంకులు తెచ్చకునే మేమంతా బుర్రలు గోక్కుంటుండగా , అప్పుడప్పుడూ ఫెయిల్ కూడా అయ్యే ఒక అమ్మాయి...
ఒక్కసారి imagine చేసుకోండి... ఏడవ క్లాసుకొచ్చి కూడా ఎక్కిళ్ళను ఇంగ్లీషులో ఏమంటారో తెలియని మా మేధావుల మధ్యలో , ఆ ఏడవ క్లాసులో కూడా ఫెయిల్ అవ్వగలిగేంత అమ్మాయి "తెలివి" ఏంత ఉంటుందో!!!
ఆ అమ్మాయి ఠపీమని సమాధనం ఇచ్చింది :
"ఎక్కేళ్స్ "
మేమంతా ఘొల్లుమన్నాం . వెంటనే భయపడ్డాం. ఈ మాస్టరు పాపం ఆ అమ్మాయిని చంపేస్తాడు మమ్మల్నందరినీ చితకబాదుతాడు అని. కానీ...... కానీ..
అతను పడీపడీ నవ్వుతున్నాడు. అతని కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి.
అతను నవ్వడం మేమెప్పుడూ చూడలేదు. అసలతనికి నవ్వడం వచ్చు అనీ ఊహించలేదు. సమాధానం చెప్పిన ఆ అమ్మాయి కూడా అమాయకంగా నవ్వేస్తోంది.
ఈ రోజుకూ ఆ అమ్మాయి ఆ మొహమే గుర్తుంది నాకు.
gender-difference లేకుండా, innocentగా బాగా గుర్తుండిపోయిన ఒక చిన్ననాటి ... స్నేహితురాలు కూడా కాదు. క్లాస్‍మేట్ అంతే.
తెలుగూ-ఇంగ్లీషు సంగమం చేసినందుకూ , అమ్మాయిలపట్ల అంత నిర్మలమైన ప్రేమ ,ఙ్ఞాపకమూ ఉండొచ్చు అని గుర్తుచేసే ఆ అమ్మాయికే ఈ నా బ్లాగు టైటిలును అంకితం చేస్తున్నా.
వీలైతే రేపు ఆ అమ్మాయి బొమ్మ గీసి పోస్ట్ చేస్తా ( నాకొచ్చిన పిచ్చి గీతల్లోనే )

Subscribe to:
Posts (Atom)